ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి హాజరై ప్రజలకు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ బారిన ప్రజలు అధికంగా పడుతున్నారని ప్లాస్టిక్ అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు.