ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంగళవారం జరుగుతున్న రథసప్తమి వేడుకలకు శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తో పాటు జిల్లా ఎస్పీ దామోదర్ దైవదర్శనం చేసుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎస్పీ దామోదర్, ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొన్నారు. అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు వారు స్వీకరించారు. తర్వాత ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు.