మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణపై అవిశ్వాస తీర్మానంపై జరగాల్సిన ప్రత్యేక సమావేశం బుధవారం వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సిన ఈ సమావేశం, 11:30 గంటలైనప్పటికీ ఫోరం సభ్యులు హాజరుకాలేకపోవడంతో అధికారులు మధ్యాహ్నం 3కి వాయిదా వేశారు. జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లు వాయిదా కోరినట్లు సమాచారం.