ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీవాసులు శనివారం నిరసనకు దిగారు. తమ స్మశాన వాటికను ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడు అంటూ నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెంటనే నిరసన కారులతో మాట్లాడారు. విషయం తెలుసుకుని ఇటువంటివి అన్యాయం జరగకుండా చూస్తామని నిరసనకారులకు హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. నిరసనతో కాసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తతంగా మారింది.