మార్కాపురం: ఘనంగా రథసప్తమి వేడుకలు

72చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంగళవారం రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాడవీధుల్లో స్వామివారిని సూర్య వాహనంపై ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీగా తరలివస్తుండడంతో కార్య నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్