మార్కాపురం: వరిగడ్డి వాము దగ్ధం

82చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు వరిగడ్డి వాముకు నిప్పంటుకొని దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పివేశారు. గడ్డివాము కాలిపోవడం వల్ల రూ. 60 వేల వరకు ఆర్థిక నష్టం జరిగిందని రైతు తెలిపాడు.

సంబంధిత పోస్ట్