ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంగళవారం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వారి ఆధ్వర్యంలో జరిగిన రథసప్తమి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డితో పాటు జిల్లా ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఎస్పీ దామోదర్, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెండి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.