నేర నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మార్కాపురం సిఐ సుబ్బారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉండే ప్రాంతాలలో అర్ధరాత్రి పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు సిఐ సుబ్బారావు అన్నారు. అనుమానస్పదంగా కనిపిస్తున్న కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో సీ. సీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.