మార్కాపురం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ పై రాసిన పాటను విద్యార్థులు ఆలపించి ఆకట్టుకున్నారు. హాస్టల్ వార్డెన్ మహాలక్ష్మి తదితరులు ఉన్నారు.