మార్కాపురం: 'వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలి'

84చూసినవారు
మార్కాపురం: 'వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలి'
వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని వైసీపీ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీర్జా షంషీర్ అలీ డిమాండ్ చేశారు. మార్కాపురంలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ముస్లిం మైనార్టీలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకొచ్చిందన్నారు. కేంద్రం బిల్లు రద్దు చేయకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్