మార్కాపురం: గంజాయి తాగుతున్న యువకులు అరెస్ట్

51చూసినవారు
మార్కాపురం: గంజాయి తాగుతున్న యువకులు అరెస్ట్
ప్రకాశం జిల్లా మార్కాపురంలో గంజాయి కొనుగోలు చేసి తాగుతున్న ఇద్దరు యువకులను పట్టణ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గంజాయి కేసులో పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. అందులో భాగంగా పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వెనుక భాగంలో యువకులు గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్