పొదిలి: పోలీసుల అదుపులో మరో 15 మంది

67చూసినవారు
పొదిలి: పోలీసుల అదుపులో మరో 15 మంది
పొదిలిలో ఈనెల 11వ తేదీన మాజీ సీఎం పర్యటన నేపథ్యంలో జరిగిన రాళ్లదాడి ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే 9 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపిన పోలీసులు విచారణలో భాగంగా శనివారం మరో 15 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాళ్ల దాడిలో మొత్తం నలుగురు గాయపడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్