ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో గత ఏడాది రవి అనే వక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈకేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. దళితనేత నీలం నాగేంద్రం జిల్లా ఎస్పీ దామోదర్‌ను మృతుడి భార్య సలొమితో కలిసి ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చాలని చేసిన విజ్ఞప్తి మేరకు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కేసును సోమవారం ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చారు.