పొదిలిలోని పొగాకు బోర్డును కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం శ్రీనివాసులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు వేలం కేంద్రంలోని పొగాకు రైతుల నుంచి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా బీజేపీ పార్టీ మీకు అండగా ఉంటుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సువర్ణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.