పొదిలి: బొప్పాయి రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

77చూసినవారు
పొదిలి: బొప్పాయి రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
పొదిలి మండలంలో గురువారం అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షాలతో బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు శుక్రవారం పొదిలి మండలంలో పర్యటించి బొప్పాయి రైతులను పరామర్శించారు. పంట నష్టం గురించి రైతుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్