ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గురువారం పొదిలి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిమ్న మహేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఆయన పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొన్నేళ్ల తర్వాత తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుండడంతో స్థానిక గ్రామాల ప్రజలు భారీగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.