పొదిలి పొగాకు బోర్డులో వైసిపి కార్యకర్తలు పొగాకు బేళ్లు తొక్కి నాశనం చేశారని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మాజీ సీఎం జగన్ పొగాకు రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు పొదిలికి వచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ ని చూసేందుకు కార్యకర్తలు పొగాకు బేళ్లను తొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో టిడిపి నాయకులు రైతులకు నష్టం కలిగించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.