కార్మికుల పై రాజకీయ వేధింపులు మానుకోవాలి

79చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బుధవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి సోమయ్య మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం కనీసం 26 వేల రూపాయలు జీతం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్