ప్రకాశం జిల్లా: పారదర్శకంగా వికలాంగుల సర్టిఫికెట్లు

59చూసినవారు
ప్రకాశం జిల్లా: పారదర్శకంగా వికలాంగుల సర్టిఫికెట్లు
ప్రకాశం జిల్లా నూతన వైద్యశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వెంకటేశ్వర్లును సోమవారం ప్రజాసంఘాల నాయకులు కలిశారు. వికలాంగుల సర్టిఫికెట్లు జారీ చేసే అంశంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారిని వారు కోరారు. అర్హత కలిగిన వికలాంగులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని అద్దంకి అజయ్, చెన్నుపల్లి శ్రీనివాసచారి, సుతారం శ్రీను, పొన్నుపల్లి బ్రహ్మానందం, ఫణి, సుధాకర్, సుతారం సుధా అధికారికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్