ప్రకాశం జిల్లా మార్కాపురం తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని తహసీల్దార్ చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొని పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చిరంజీవి అన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.