ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

56చూసినవారు
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
పొదిలి మండలంలోని అగ్రహారం గ్రామంలో శనివారం ఉదయం ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మార్కాపురం మండల తాహసీల్దార్ కె.చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్ళే దశలో ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయిన కారు అదుపు తప్పి బోల్తా పడిందని తాహసీల్దార్ తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు మరియు పోలీసులు గాయాలుపడిన చిరంజీవిని సమీప ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్