మార్కాపురం ప్రాంతీయ రవాణా శాఖ అధికారిణిగా (ఆర్ టి వో) గా శ్రీ చందన గురువారం వారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈమె నెల్లూరు జిల్లా నుండి ఇక్కడకు బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ ఆర్ టి వో గా పనిచేసిన అమర్ నాయక్ పదవి విరమణ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా నూతన ఆర్ టి వో కు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవ రావు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.