ప్రకాశం జిల్లా పొదిలి మండల పరిసర ప్రాంతాలలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం అయ్యేసరికి అకస్మాత్తుగా వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలుల వల్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.