ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రం వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పొదిలి పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్టుగా అనుమానితుడు పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. జల్సాల కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేయడాన్ని నిందితుడు హాబీగా పెట్టుకున్నాడని ఎస్ఐ వేమన మీడియాకు వెల్లడించారు.