ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీ కార్యాలయం నందు బుధవారం ఎంపీ తనయుడు మాగుంట రాఘవరెడ్డిని స్థానిక టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను రాఘవరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన రాఘవరెడ్డి తమ సమస్యలను తన తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.