కనిగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. మంగళవారం గ్రామానికి చెందిన యనముల పాపయ్య ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువాలోని రూ. 70 వేలు విలువచేసే బంగారు ఆభరణాలను దొంగిలించికెళ్లారని బాధితుడు పాపయ్య తెలిపాడు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు.