ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని ఒంగోలు-కర్నూలు హైవేపై బుధవారం ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పట్టణంలో ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. పట్టణంలో ఎక్కడ చూసినా జన సందోహంగా మారింది.