ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మార్కాపురం విశ్రాంత డిప్యూటీ డీఈవో మల్లికార్జున రావును ఘనంగా సత్కరించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 86-87 బ్యాచ్ కు చెందిన పలువురు విద్యార్థులు రిటైర్డ్ డిప్యూటీ డిఈఓ మల్లికార్జునరావు ను ఘనంగా సన్మానించారు. తాము చదువుకున్న బాయ్స్ హై స్కూల్ లోనే ఈ సన్మానం చేశారు. మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, సంపాదన అంతిమ లక్ష్యం కాదని,ప్రతి విద్యార్థి ఆనందాన్ని తల్లిదండ్రుల సేవలో వెతుక్కోవాలని మార్గదర్శనం చేశారు.