బోడపాడులో బీ.ఆర్ అంబేడ్కర్ కు ఘన నివాళులు

66చూసినవారు
మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామ ఎంపీపీ పాఠశాలలో సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీవి. సురేఖ, ఉపాధ్యాయులు శ్రీనివాసులు విద్యార్థులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు జయ భీమ్ జయ అంబేద్కర్ అంటూ సాగిన ప్రత్యేక గీతాన్ని ఆలపిస్తూ ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్