ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సోమవారం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ ఆధ్వర్యంలో యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు యోగ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈనెల 21వ తేదీన విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని అన్నారు.