ప్రకాశం జిల్లాలో 14 కరోనా కేసులు

79చూసినవారు
ప్రకాశం జిల్లాలో 14 కరోనా కేసులు
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు సాధారణంగా నమోదు అవుతున్నప్పటికీ చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కోవిడ్ పరీక్షలు చేపట్టారు. గర్భిణులు, శస్త్ర చికిత్సలు చేయించుకునేవారు, దీర్ఘకాలిక వ్యాధుల వారికి ముందు పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటివరకు 250 మందిని పరీక్షించగా 14 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో అరుగురు చికిత్స తీసుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురు హోం ఐసోలేషన్లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్