ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాన్ని ఈనెల 16వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు అజెండా కాపీని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కార్పోరేటర్లకు పంపించారు. మూడు నెలలకోసారి ఈ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా దాదాపు 4 నెలల పాటు సమావేశం జరగలేదు. ప్రభుత్వం మారాక తొలిసారి జరగబోయే సమావేశంలో పలు అభివృద్ధి అంశాలను చర్చించనున్నారు.