కొత్తపట్నం బీచ్ కు సందర్శకుల తాకిడి

51చూసినవారు
కొత్తపట్నం మండలంలోని సముద్ర తీరం వద్ద ఆదివారం పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొన్నది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఒంగోలు పరిసర ప్రాంతాలలోని ప్రజలు అధిక సంఖ్యలో బీచ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సముద్ర కెరటాల్లో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. మరోవైపు మెరైన్ పోలీసులు సముద్రం లోపలికి పర్యాటకులు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్