ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ శివరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2013 మే 1 నుండి జూలై 31 లోపు జన్మించిన విద్యార్థులు వెబ్సైట్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని, పాఠశాల హెచ్ఎంతో ధృవీకరించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.