సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ కలెక్టర్ ను కోరారు. ఆదివారం ఒంగోలులో కలెక్టరెట్ లో నేతలు కలిశారు. అలాగే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కరుణాకర్, శ్రీకృష్ణ, సూర్య ప్రకాష్, రాము పాల్గొన్నారు.