18వ జాతీయ గణాంక దినోత్సవం నిర్వహణ

64చూసినవారు
18వ జాతీయ గణాంక దినోత్సవం నిర్వహణ
18 జాతీయ గణాంక దినోత్సవాన్ని ఒంగోలులోని కలెక్టరేట్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్ధగణాంక అధికారి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ జాతీయ గణాంకాల్లో ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం ప్రశాంత్ చంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప గణాంక అధికారులు, సహాయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్