జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ ఛార్జ్, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.