నేటి నుండి తక్కువ ధరకే నిత్యవసర సరుకులు

72చూసినవారు
నేటి నుండి తక్కువ ధరకే నిత్యవసర సరుకులు
పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించాలన్న ప్రభుత్వం ఆదేశాలతో ఈ నెల 11వ తేదీ నుండి జిల్లాలోని అన్ని రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు విక్రయించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాణ్యమైన బిపిటి బియ్యం స్టీమ్ చేసినవి కిలో రూ. 49కి, పచ్చి బియ్యం రూ. 48 కి అందించాలని మార్కెటింగ్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కందిపప్పు కూడా కిలో రూ. 160 అందుబాటులో ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్