కనిగిరి 4వ సచివాలయంలో ఉన్న ఆధార కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ఆధార్ అప్లోడ్ సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డులు లేక ఆధార్ కార్డులో తప్పుల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆధార్ లో తప్పులు సరి చేయడమే కాక, నూతన ఆధార్ కార్డుల మంజూరులో జాప్యం జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.