ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బుధవారం కొత్తపట్నం లోని టిడిపి కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ క్లస్టర్ ఇంచార్జిలో కార్యదర్శిలతో ఆయన సమావేశమయ్యారు. నూతన మండల గ్రామ, సెక్రటరీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పిడిసిసి బ్యాంకు చైర్మన్ సీతారామయ్య, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.