వేటకెళ్లి గాయపడిన మత్స్యకారుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. కొత్తపట్నం మండలం మదనూరు పంచాయతీ పరిధి చిన పట్టపుపాలేనికి చెందిన వాయల పోలయ్య తన కుమారుడు వినయ్ తో కలిసి ఈ నెల 7న సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వల విసురుతుండగా వెనక్కి పడడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి వెళ్ళాడు. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురువారం మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు.