ఒంగోలులోని పోలీస్ పెరెడ్ గ్రౌండ్ లో గురువారం కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తో పాటు 1600, 100 మీటర్లు పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 600 మందికి గాను 247 మంది అభ్యర్థులు హాజరు కాగా, 188 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు.