ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. చివరగా క్రాఫ్ట్, డ్రాయింగ్, వొకేషనల్ టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి 35 మందికి బదిలీలు ఇచ్చారు. మొత్తం 10 రోజులు జరిగిన ఈ ప్రక్రియలో ఉమ్మడి ప్రకాశంలో 3,931 మందికి బదిలీ జరిగింది. బదిలీలపై ఫిర్యాదులుంటే జిల్లాస్థాయి కమిటీకి ఇవ్వాలని, అవసరమైతే రీజనల్ స్థాయి, చివరికి విద్యా కమిషనర్ వరకు అప్పీల్ చేయవచ్చని డీఈవో కిరణ్‌కుమార్ సూచించారు. నేరుగా చట్టపరంగా వెళ్లకూడదని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.