ఒంగోలు: సంచలన హత్య కేసులో నిందితులు అరెస్ట్

67చూసినవారు
ఒంగోలు: సంచలన హత్య కేసులో నిందితులు అరెస్ట్
మాజీ ఎంపీపీ, టిడిపి నేత వీరయ్య చౌదరి హత్యకేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వీరయ్య చౌదరి హత్యకు తన స్వగ్రామమైన అమ్మనబ్రోలు గ్రామంలోనే ఆదిపత్య పోరు కారణమని తేల్చారు. గ్రామంలో ఇసుక వ్యవహారంలో ఆదిపర్య పోరులో ప్రత్యర్ధులు వీరయ్య చౌదరిని హత్య చేసినట్లుగా తెలిపారు.