ఒంగోలు: వందేభారత్ రైలుపై రాళ్లదాడిలో నిందితులు అరెస్ట్

64చూసినవారు
ఒంగోలు: వందేభారత్ రైలుపై రాళ్లదాడిలో నిందితులు అరెస్ట్
ఈ నెల 5న సూరారెడ్డిపాలెం - ఒంగోలు స్టేషన్ల మధ్య వందేభారత్ రైలుపై రాళ్లదాడిలో బోగీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇంజినీరింగ్ విద్యార్థులు గంగవరపు రిషీంద్రబాబు, షేక్ ఖాదర్ బాషా, షేక్ ఆదిష్ కరీముల్లా ఈ దాడికి పాల్పడ్డారని గుర్తించి రిమాండ్ కు తరలించారు. కాగా వారు మద్యం తాగి ముందుగా కోర్బా - త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ పై రాళ్లు విసిరినట్టు వెల్లడైంది. విద్యార్థులు ఇలాంటి చర్యలకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీఎస్పీ మురళీధర్ సూచించారు.

సంబంధిత పోస్ట్