ప్రకాశం జిల్లా ఒంగోలు లో ఇటీవల దారుణంగా హత్యకు గురైన వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక సమాచారం బయటపడింది. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి ఆళ్ల సాంబయ్య అలియాస్ సిద్ధాంతి అని ప్రకాశం ఎస్పీ దామోదర్ మీడియాకు బుధవారం వెల్లడించారు. వీరయ్య చౌదరి హత్యకు అమ్మనబ్రోలు గ్రామంలో ఉన్న ఆధిపత్య పోరాటం ప్రధాన కారణంగా నిలిచింది. పోలీసులు కేసు సంబంధిత సాక్ష్యాలను సేకరించి విచారణను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.