ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఆర్ఎస్యూ అధ్యక్షులు పరుచూరి అవినాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఆర్ఎస్యు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకపోయినా కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.