ట్రాక్టర్ ను ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన ఈతముక్కలలో శనివారం చోటుచేసుకుంది. టంగుటూరు మండలం వాసెగిరిపాడుకు చెందిన డి. నారాయణ (40) రొయ్యల కొనుగోలుకు వచ్చి తిరుగు ప్రయాణంలో గ్రామ శివారులోని డంపింగ్ యార్డు వద్ద నిలిచిన ట్రాక్టర్ ను వెనక నుంచి ఢీకొట్టారు. తీవ్ర గాయాలతో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించగా అక్కడ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.