ఒంగోలు: మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

55చూసినవారు
ఒంగోలు: మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
రానున్న మూడు రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సోమవారం తెలిపారు. 15వ తేదీన ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భిన్న వాతావరణంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లి నిలబడకూడదన్నారు.

సంబంధిత పోస్ట్