ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ను జిల్లా కలెక్టర్ అన్సారియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో విక్రయిస్తున్న తినుబండారాలు, ఇతరలను పరిశీలించారు. ఎక్స్పైరీ డేట్ ను స్వయంగా పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. అధిక ధరలతో ప్రయాణికులకు వస్తువులను విక్రయించరాదని సూచించారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.